జీవో 252 ను వ్యతిరేకిస్తూ జర్నలిస్టుల ఆందోళన..
పెద్దపల్లి, 27 డిసెంబర్ (హి.స.) జర్నలిస్టుల హక్కులను కాలరాసే విధంగా ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 252 ను వెంటనే సవరించాలని పెద్దపల్లి జిల్లా జర్నలిస్టులు డిమాండ్ చేశారు. అక్రిడేషన్ల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరిని మానుకోవాలని వారు నేడ
జర్నలిస్ట్ ఆందోళన


పెద్దపల్లి, 27 డిసెంబర్ (హి.స.)

జర్నలిస్టుల హక్కులను కాలరాసే విధంగా ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 252 ను వెంటనే సవరించాలని పెద్దపల్లి జిల్లా జర్నలిస్టులు డిమాండ్ చేశారు. అక్రిడేషన్ల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరిని మానుకోవాలని వారు నేడు కలెక్టరేట్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. అనంతరం ఆడిషినల్ కలెక్టర్ వేణుకు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో 23వేల అక్రెడిటేషన్ కార్డులివ్వగా, కొత్త జీవోతో అవి 10 వేలకు పైగా కార్డులకు కోత పడే ప్రమాదం ఉందని జర్నలిస్ట్ లు ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో నియోజకవర్గ స్థాయిలో రిపోర్టర్లకు ఒక కార్డు ఉండేదని.. ఇప్పుడు అది రద్దు చేసి, స్టేట్, జిల్లా, మండలస్థాయిలో మాత్రమే కార్డులివ్వాలని నిర్వహించడం దారుణమన్నారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande