
హైదరాబాద్, 27 డిసెంబర్ (హి.స.)
ఇటీవల 'దండోరా' ప్రీ రిలీజ్ ఈవెంట్
లో నటుడు శివాజీ మహిళలపై చేసిన కామెంట్లు పెను దుమారాన్ని రేపాయి.
ఈ నేపథ్యంలో వీరి ఇద్దరి మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. నటుడు, జనసేన నేత నాగబాబు, బిందు మాధవి, గాయని చిన్మయి అనసూయకు బాసటగా నిలిచారు. తాజాగా నటుడు, రాజకీయ విమర్శకుడు ప్రకాష్ రాజ్ కూడా అనసూయకు మద్దతుగా నిలిచాడు. సంస్కారులమని చెప్పుకునే వాళ్ళు ఎంతైనా మొరగనివ్వు. అది వాళ్ళ కుంచిత మనస్తత్వం. మేమంతా నీతోనే ఉంటాం అంటూ ట్వీట్ చేశారు. మరోవైపు నటుడు శివాజీ నేడు తెలంగాణ మహిళా కమిషన్ ముందు హాజరయ్యారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..