
సూర్యాపేట, 27 డిసెంబర్ (హి.స.)
మొబైల్ ఫోన్స్ కు వచ్చే ఏపీకే ఫైల్స్ అత్యంత ప్రమాదకరమని వీటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె.నరసింహ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. వాట్సాప్ గ్రూపుల ద్వారా, ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా ఏపీకే ఫైల్స్ సందేశం పంపించి సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారన్నారు. ఏపీకే ఫైల్స్ అనుసరించేలా చేసి మొబైల్ హ్యాక్ చేసి సైబర్ మోసగాళ్లు ఆర్థిక నష్టాన్ని కలిగిస్తారని తెలిపారు. ఏపీకె ఫైల్స్ అనేవి సైబర్ మోసగాళ్ల ఎత్తుగడ మాత్రమేనని ఏపీకే ఫైల్స్ అనుసరిస్తూ మొబైల్ యాప్ లు డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేస్తే మొబైల్ డాటా దొంగిలించి హ్యాక్ చేసి ఆర్థిక నష్టం కలిగిస్తారని తెలిపారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు