
హైదరాబాద్, 27 డిసెంబర్ (హి.స.)
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TS
TET-2026)కు సంబంధించి ఇవాళ తెలంగాణ పాఠశాల విద్యాశాఖ హాల్ టికెట్లను విడుదల చేసింది. ఈ మేరకు పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా టెట్ పరీక్షలు జనవరి 3 నుంచి జనవరి 31 వరకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) విధానంలో రెండు షిఫ్ట్లలో జరుగనున్నాయి. ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ జర్నల్ నంబర్, పుట్టిన తేదీ వంటి లాగిన్ వివరాలతో హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చిన విద్యాశాఖ అధికారులు వెల్లడించారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..