పెద్దపల్లి జిల్లా మంథనిలో మళ్లీ పెద్దపులి కలకలం
పెద్దపల్లి, 27 డిసెంబర్ (హి.స.) పెద్దపల్లి జిల్లా మంథనిలో మళ్లీ పెద్దపులి సంచారం కలకలం రేపుతుంది. బాబోయ్ మళ్ళీ మంథనికి పులి..వచ్చిందంటూ.. ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గత మార్చి నెలలో మంథని మండలం బిట్టుపల్లి, ఎక్లాస్ పూర్, ఖమ్మంపల్లి, గోపాల్ పూర్..
పెద్దపులి


పెద్దపల్లి, 27 డిసెంబర్ (హి.స.) పెద్దపల్లి జిల్లా మంథనిలో మళ్లీ పెద్దపులి సంచారం కలకలం రేపుతుంది. బాబోయ్ మళ్ళీ మంథనికి పులి..వచ్చిందంటూ.. ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గత మార్చి నెలలో మంథని మండలం బిట్టుపల్లి, ఎక్లాస్ పూర్, ఖమ్మంపల్లి, గోపాల్ పూర్.. తో పాటు అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచరించి స్థానిక ప్రజలను, రైతులను భయాందోళనకు చెందారు. అప్పుడు అటవీ శాఖ శాఖ అధికారులకు కంటి మీద కునుకు లేకుండా చేసింది ఈ పెద్ద పులి. వారం క్రితం మంచిర్యాల్, ఎన్టీపీసీ ప్రాంతంలో సంచరించినట్లు ఆ తర్వాత మళ్ళీ చెన్నూరు దగ్గర ఉన్న ఫారెస్ట్ లో కి వెళ్లినట్లు అధికారులు తెలిపారు.

మళ్ళీ శుక్రవారం సాయంత్రం మంథని మండలంలోని వెంకటాపూర్, ఆరెందా అడవి ప్రాంతంలో సంచరిస్తుందని మంథని ఫారెస్ట్ అధికారులు పులి అడుగులను గుర్తించారు. శనివారం ఉదయం ఆరెందా అటవీ ప్రాంతం నుండి మానేరు గుండా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం దామెర కుంట వైపు వెళ్లినట్లు అధికారులు తెలిపారు. పులి అడుగులు అటు వైపు వెళ్లినట్లుగా ఉన్నాయని అధికారులు నిర్ధారించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande