బెల్ట్ షాపులను మూసేయాలని ఎక్సైజ్ ఆఫీస్ను ముట్టడించిన మహిళలు
ఖమ్మం, 27 డిసెంబర్ (హి.స.) ఖమ్మం జిల్లా మధిర మండలం చిలుకూరు గ్రామంలో విచ్చలవిడిగా సాగుతున్న బెల్ట్ షాపుల అమ్మకాలను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ గ్రామ మహిళలు శనివారం కదం తొక్కారు. స్థానిక ఎక్సైజ్ కార్యాలయం ఎదుట బైఠాయించి భారీ ధర్నా నిర్వహి
ఎక్సైజ్ ఆఫీస్


ఖమ్మం, 27 డిసెంబర్ (హి.స.)

ఖమ్మం జిల్లా మధిర మండలం చిలుకూరు గ్రామంలో విచ్చలవిడిగా సాగుతున్న బెల్ట్ షాపుల అమ్మకాలను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ గ్రామ మహిళలు శనివారం కదం తొక్కారు. స్థానిక ఎక్సైజ్ కార్యాలయం ఎదుట బైఠాయించి భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ.. గ్రామంలో బెల్ట్ షాపుల వల్ల శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం బాటిళ్లపై స్టిక్కర్లు లేకుండా పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ నుండి మద్యాన్ని తీసుకువచ్చి గ్రామంలో విచ్చలవిడిగా అమ్ముతున్నారని ఆరోపించారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande