
అమరావతి, 27 డిసెంబర్ (హి.స.)
ఏపీ(Ap)లో ఏడుగురు వైసీపీ నేతలు అరెస్ట్ అయినట్లు తెలుస్తోంది. డిసెంబర్ 21న జరిగిన వైఎస్ జగన్(Ys Jagan) పుట్టిన రోజు వేడుకల్లో వైసీపీ నేతలు అత్యుత్సాహం ప్రదర్శించారు. జగన్ ఫ్లెక్సీ ఎదుట మేకపోతును బలి ఇచ్చారు. అంతేకాదు మేకపోతు నుంచి తీసిన రక్తంతో జగన్ ఫెక్సీకి అభిషేకం చేశారు. ఈ తంతు మొత్తం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో విమర్శలు వ్యక్తమయ్యాయి. వారందరిపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వినిపించింది. ఈమేరకు ఏడుగురు వైసీపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించే అవకాశం ఉందని సమాచారం. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం చోడవరంలో జరిగింది. ఇక మేకపోతు బలిపై జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ స్పందించారు. పార్టీ నేతలు, అభిమానులు జంతు బలి చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇలాంటి దారుణమైన ఘటనలతో భ్రయబ్రాంతులకు గురి చేయొద్దని ఎస్పీ సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV