రాష్ట్ర విభజన వద్దని చెప్పాను : జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు
అమరావతి, 27 డిసెంబర్ (హి.స.) కాంగ్రెస్ సీనియర్ నేత, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి రాష్ట్ర విభజనపై సంచలన వ్యాఖ్యలు చేసారు. నేడు మీడియా సమావేశంలో మాట్లాడిన జగ్గారెడ్డి.. తాను రాష్ట్ర విభజనను వ్యతిరేకించినట్టు పేర్కొన్నారు. అప్పుడు రాష్ట్ర
jagga-reddys-sensational-comments


అమరావతి, 27 డిసెంబర్ (హి.స.)

కాంగ్రెస్ సీనియర్ నేత, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి రాష్ట్ర విభజనపై సంచలన వ్యాఖ్యలు చేసారు. నేడు మీడియా సమావేశంలో మాట్లాడిన జగ్గారెడ్డి.. తాను రాష్ట్ర విభజనను వ్యతిరేకించినట్టు పేర్కొన్నారు. అప్పుడు రాష్ట్ర విభజనకు చంద్రబాబు, జగన్ కూడా అనుకూల లేఖలు ఇచ్చారని గుర్తు చేసారు. ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు నాయుడు, మాజీ సీఎం జగన్, పవన్ కళ్యాణ్ ప్రతీ ఒక్కరూ ప్రధాని మోడీ ఆడమన్నట్టు ఆడుతున్నారని మండిపడ్డారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని మరోసారి గుర్తు చేసారు జగ్గారెడ్డి. పార్లమెంటులో మాకు 20 మంది ఎంపీలను ఇస్తే.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఆపుతామని ధీమా వ్యక్తం చేసారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande