
విశాఖపట్నం, 27 డిసెంబర్ (హి.స.)
విశాఖపట్నంలోని శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారిని భక్తులు ఉదయం నుంచి దర్శించుకుంటున్నారు. శనివారం పురస్కరించుకొని అమ్మవారికి తులసి దళార్చన నిర్వహించారు. ప్రతి శనివారం అమ్మవారికి తులసి దళార్చన చేస్తారని ఆలయ పూజారులు తెలియజేశారు. ముఖ్యంగా మార్గశిర మాసంలో ఘనంగా నిర్వహిస్తారన్నారు. ప్రతి శనివారం ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు ఈ పూజ ఉంటుంన్నారు. దీనికి ఉభయదాతలు, అర్చకులు, వేదపండితులు హాజరై భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తారన్నారు. ఈ సమయంలో అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తారని పేర్కొన్నారు. ఆలయ ప్రాంగణం పవిత్రంగా, అలంకరణలతో కళకళలాడుతుందన్నారు. ఈ పూజ ద్వారా అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని అన్నారు. తలసి దళార్చన వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకంగా తెలిపారు. లక్ష్మీదేవికి తులసి అంటే ఎంతో ప్రీతి పాత్రమైనదని తెలియజేశారు. తులసీ దళాలతో పూజ చేయడం వలన ధన, ధాన్య, సౌభాగ్యాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయని పూజారులు వివరించారు. ప్రజలందరిపై అమ్మవారి అనుగ్రహం ఉండాలని ఆశీర్వచనాలు అందజేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV