గ్రేటర్ గుంటూరు కు ఆమోదం
గుంటూరు 28 డిసెంబర్ (హి.స.)మండలంలోని లాల్పురం, చల్లావారిపాలెం, వెంగళాయపాలెం, మల్లవరం, చిన్నపలకలూరు, తోక వారిపాలెం, తురకపాలెం, గొర్లవారిపాలెం, ఓబుల్ నాయుడుపాలెం, జొన్నలగడ్డ.. పెదకాకాని మండలంలోని అగతవరప్పాడు, వెనిగండ్ల, పెదకాకాని, తక్కెళ్ళపాడు, చంద్
గ్రేటర్ గుంటూరు కు ఆమోదం


గుంటూరు 28 డిసెంబర్ (హి.స.)మండలంలోని లాల్పురం, చల్లావారిపాలెం, వెంగళాయపాలెం, మల్లవరం, చిన్నపలకలూరు, తోక వారిపాలెం, తురకపాలెం, గొర్లవారిపాలెం, ఓబుల్ నాయుడుపాలెం, జొన్నలగడ్డ.. పెదకాకాని మండలంలోని అగతవరప్పాడు, వెనిగండ్ల, పెదకాకాని, తక్కెళ్ళపాడు, చంద్రపాలెం.. వట్టి చెరుకూరు మండలంలోని కొర్నె పాడు, పుల్లడిగుంట, తాడికొండ మండలం లాం గ్రామాల విలీనంతో గుంటూరు మహానగరంగా విస్తరించనున్నది. ఈ మేరకు శనివారం జరిగిన కౌన్సిల్ సమావేశంలో నగరపాలక సంస్థ ఆమోదం తెలిపింది. గుంటూరును మహా నగరపాలక సంస్థగా మార్చేందుకు కౌన్సిల్ ఆమోదముద్ర వేసినట్లు మేయర్ కోవెలముడి రవీంద్ర ప్రకటించారు. నగరాన్ని మిలీనియం సిటీ కాన్సెప్ట్ భాగంగా మహా నగరపాలక సంస్థగా విస్తరించేందుకు ప్రభుత్వం సిద్ధమైందని, ఇందులో భాగంగా 18 గ్రామాలను విలీనం చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande