మన్‌కీ బాత్‌’కార్యక్రమం 129వ ఎసిపోడ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ
ఢిల్లీ28,డిసెంబర్ (హి.స.) ఆపరేషన్ సిందూర్‌ (Operation Sindoor)తో భారత్‌ ప్రపంచ దేశాలకు తన బలాన్ని చూపించిందని.. దేశ భద్రతపట్ల తమ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనమన్నారు. దేశంలోని ప్రతిపౌరుడికి ఈ ఆపరేషన్‌ గర్వకారణంగా మారిందన్నారు. ‘వంద
Modi-conversation-PM-New-Zealand-FTA


ఢిల్లీ28,డిసెంబర్ (హి.స.)

ఆపరేషన్ సిందూర్‌ (Operation Sindoor)తో భారత్‌ ప్రపంచ దేశాలకు తన బలాన్ని చూపించిందని.. దేశ భద్రతపట్ల తమ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనమన్నారు. దేశంలోని ప్రతిపౌరుడికి ఈ ఆపరేషన్‌ గర్వకారణంగా మారిందన్నారు. ‘వందేమాతరం’ 150 ఏళ్లు పూర్తి చేసుకున్నప్పుడు కూడా దేశ ప్రజల్లో ఇదే స్ఫూర్తి కనిపించిందని పేర్కొన్నారు.

క్రీడల పరంగా కూడా ఈ ఏడాది చిరస్మరణీయమని) మోదీ పేర్కొన్నారు. 12 ఏళ్ల తర్వాత టీమ్‌ఇండియా పురుషుల క్రికెట్ జట్టు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని సొంతం చేసుకుందని.. మహిళల క్రికెట్ జట్టు మొదటిసారి వన్డే ప్రపంచ కప్‌ను గెలుచుకుందన్నారు. మహిళల అంధుల జట్టు టీ20 ప్రపంచ కప్‌ను గెలుచుకొని చరిత్ర సృష్టించిందని గుర్తు చేసుకున్నారు. అంతరిక్ష రంగంలోనూ ఈ ఏడాది భారత్‌ తన ప్రతిభను చాటుకుందని అన్నారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించిన శుభాన్షు శుక్లాను ప్రశంసించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande