సబ్మెరైన్లో ప్రయాణించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
కర్ణాటక, 28 డిసెంబర్ (హి.స.) దేశ ప్రథమ పౌరురాలు, త్రివిధ దళాల సుప్రీం కమాండర్ ద్రౌపది ముర్ము జలాంతర్గామిలో ప్రయాణించారు. కర్ణాటక లోని కార్వార్ నౌకాదళ స్థావరం (Karwar Naval base) నుంచి కల్వరి శ్రేణి (Kalvari series) జలాంతర్గామి ఐఎన్ఎస్ వాఘ్షీర్
ద్రౌపది ముర్ము


కర్ణాటక, 28 డిసెంబర్ (హి.స.)

దేశ ప్రథమ పౌరురాలు, త్రివిధ

దళాల సుప్రీం కమాండర్ ద్రౌపది ముర్ము జలాంతర్గామిలో ప్రయాణించారు. కర్ణాటక లోని కార్వార్ నౌకాదళ స్థావరం (Karwar Naval base) నుంచి కల్వరి శ్రేణి (Kalvari series) జలాంతర్గామి ఐఎన్ఎస్ వాఘ్షీర్ (INS Vaghsheer) లో వారు బయలుదేరారు.

రాష్ట్రపతి వెంట నౌకాదళాధిపతి అడ్మిరల్ దినేష్ కె త్రిపాఠి ఉన్నారు. కల్వరి క్లాస్ జలాంతర్గామిలో రాష్ట్రపతి ముర్ము ప్రయాణించడం ఇదే తొలిసారి. గతంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం కల్వరి శ్రేణి సబ్మెరైన్లో ప్రయాణించారు. ఆ తర్వాత సబ్మెరైన్లో ప్రయాణిస్తున్న రెండో రాష్ట్రపతిగా ముర్ము గుర్తింపు పొందారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande