సంగారెడ్డి.జిల్లాలో.గిరంరోదూ.ప్రమాదం ముగ్గురి.మృతి
అమరావతి, 28 డిసెంబర్ (హి.స.): సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌ అదుపు తప్పి కల్వర్టు గుంతలో పడటంతో ముగ్గురు మృతిచెందారు. నారాయణఖేడ్‌ శివారులో నిజాంపేట్‌-బీదర్‌ జాతీయ రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది. కొత్తగా నిర్మిస్తున్న 161బి హైవేపై
సంగారెడ్డి.జిల్లాలో.గిరంరోదూ.ప్రమాదం ముగ్గురి.మృతి


అమరావతి, 28 డిసెంబర్ (హి.స.): సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌ అదుపు తప్పి కల్వర్టు గుంతలో పడటంతో ముగ్గురు మృతిచెందారు. నారాయణఖేడ్‌ శివారులో నిజాంపేట్‌-బీదర్‌ జాతీయ రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది. కొత్తగా నిర్మిస్తున్న 161బి హైవేపై కల్వర్టు కోసం తవ్విన గుంతలో బైక్‌ పడింది. దీంతో ఆవుటి నర్సింహులు (27), జిన్న మల్లేశ్‌ (24), జిన్న మహేశ్‌ (23) మృతిచెందారు. మృతులను నారాయణఖేడ్‌ మండలం నర్సాపూర్‌ వాసులుగా గుర్తించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande