
హైదరాబాద్, 28 డిసెంబర్ (హి.స.)
: తెలుగు ఫిల్మ్‌ఛాంబర్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఇది కొనసాగనుంది. సాయంత్రం 6 గంటలకు ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి.
మన ప్యానల్ పేరిట చిన్న నిర్మాతలు, ప్రొగ్రెసివ్ ప్యానల్ పేరుతో పెద్ద నిర్మాతలు పోటీ పడుతున్నారు. తెలుగు ఫిల్మ్‌ఛాంబర్‌లో 3,355 మంది సభ్యులున్నారు. ఛాంబర్ అధ్యక్ష, కార్యదర్శులతో పాటు 12 మంది ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులను ఎన్నుకోనున్నారు. ఈ ఎన్నికల్లో గెలిచిన నూతన కార్యవర్గం 2027 వరకు కొనసాగనుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ