
న్యూఢిల్లీ, 28 డిసెంబర్ (హి.స.)
బీజేపీ మత రాజకీయాలు చేస్తోందని బీజేపీ, ఆర్ఎస్ఎస్కు వ్యతిరేకంగా పోరాడాలని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే పిలుపునిచ్చారు. ఇవాళ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఢిల్లీలోని ఇందిరా భవన్ లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మల్లికార్జున ఖర్గే పార్టీ జెండా ఆవిష్కరించారు. పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్తో పాటు పార్టీ నేతలు హాజరైన ఈ కార్యక్రమంలో మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ బీజేపీ, ఆర్ఎస్ఎస్పై ఫైర్ అయ్యారు. ప్రజల అధికారాలను ఆర్ఎస్ఎస్ లాక్కునే ప్రయత్నం చేస్తోందని దుయ్యబట్టారు.
కాంగ్రెస్ పని అయిపోయిందని అంటున్నారు. మా శక్తి తగ్గింది కానీ పోరాటం ఆగలేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పాలనలో అనేక చారిత్రాత్మక మార్పులొచ్చాయని హరిత విప్లవం, ఆర్థిక సంస్థరణలు, ఐటీ విద్యారంగంలో అనేక మార్పులు తీసుకొచ్చామన్నారు. కాంగ్రెస్ హాయంలో ఏర్పాటు చేసిన సంస్థలను మోడీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని దుయ్యబట్టారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు