20లోగా భాజపా అధ్యక్ష ఎన్నిక .
ఢిల్లీ28,డిసెంబర్ (హి.స.)భారతీయ జనతా పార్టీ (భాజపా) నూతన అధ్యక్షుడి ఎన్నికకు రంగం సిద్ధమవుతోంది. జనవరి 20వ తేదీలోగా అధ్యక్ష ఎన్నికను పూర్తి చేయాలని ఆ పార్టీ భావిస్తోంది. పార్టీ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని యువతరానికి పెద్ద పీట వేయాలన్న వ్యూహంలో భ
20లోగా భాజపా అధ్యక్ష ఎన్నిక .


ఢిల్లీ28,డిసెంబర్ (హి.స.)భారతీయ జనతా పార్టీ (భాజపా) నూతన అధ్యక్షుడి ఎన్నికకు రంగం సిద్ధమవుతోంది. జనవరి 20వ తేదీలోగా అధ్యక్ష ఎన్నికను పూర్తి చేయాలని ఆ పార్టీ భావిస్తోంది. పార్టీ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని యువతరానికి పెద్ద పీట వేయాలన్న వ్యూహంలో భాగంగా ఇటీవల కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమితులైన 45 ఏళ్ల నితిన్‌ నబీన్‌నే ఈ పదవికి ఎంపిక చేయనున్నట్లు సమాచారం.

భాజపా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ జనవరి 15 తర్వాత వేగం పుంజుకోనుంది. దేశవ్యాప్తంగా ఉన్న పార్టీ రాష్ట్రశాఖల అధ్యక్షులకు దిల్లీ రావాలని పిలుపు వెళ్లనుంది. జనవరి 18 నుంచి 20 మధ్య మూడు రోజులపాటు ఎన్నికల ప్రక్రియ జరగనుంది. జనవరి 20వ తేదీ నాటికి కొత్త అధ్యక్షుడిని అధికారికంగా ప్రకటించే అవకాశముందని పార్టీ వర్గాలు తెలిపాయి

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande