
ఢిల్లీ28,డిసెంబర్ (హి.స.) : భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఇవాళ (డిసెంబర్ 28)న ఢిల్లీలోని ఇందిరా భవన్‌లో ఘనంగా జరుపుకుంది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ తదితర సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
జెండా ఆవిష్కరణ తర్వాత పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన ఖర్గే, బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనలో దేశంలో అనేక చరిత్రాత్మక మార్పులు వచ్చాయని, గ్రీన్ రివల్యూషన్, వైట్ రివల్యూషన్ వంటి కార్యక్రమాలతో దేశాన్ని మార్చామని చెప్పుకొచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ