
ఢిల్లీ28,డిసెంబర్ (హి.స.) : యూపీయే పాలనలో తీసుకువచ్చిన ‘మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం’ (ఎంజీ నరేగా) స్థానంలో కేంద్ర సర్కారు తీసుకువచ్చిన కొత్త చట్టంపై జనవరి 5 నుంచి దేశవ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళన చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. వీబీ జీ రామ్ జీ పేరుతో తెచ్చిన చట్టాన్ని కేంద్ర సర్కారు వెనక్కి తీసుకునేలా ఈ పోరాటం కొనసాగించనుంది. శనివారం ఇక్కడి ఇందిరాభవన్‌లో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే, అగ్రనేతలు- సోనియాగాంధీ, రాహుల్‌గాంధీల ఆధ్వర్యంలో జరిగిన పార్టీ అత్యున్నత విధాన నిర్ణాయక మండలి.. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం ఈమేరకు ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ఉపాధి హామీ పథకానికి మద్దతుగా నాయకులంతా ప్రమాణం చేశారు. ఎట్టిపరిస్థితుల్లోనూ మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకాన్ని రక్షించుకుంటామని, గ్రామీణ కూలీల హక్కులను, మహాత్మాగాంధీ పేరును కాపాడతామని శపథం చేశారు
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ