పట్టాలు తప్పిన గూడ్స్ .. ఎనిమిది వ్యాగన్లు తిరగబడి..
హాజీపూర్/ఢిల్లీ28,డిసెంబర్ (హి.స.) : బీహార్‌లోని హాజీపూర్ పరిధిలో రైలు ప్రమాదం సంభవించింది. ఒక గూడ్స్ రైలుకు చెందిన ఎనిమిదికి పైగా వ్యాగన్లు పట్టాలు తప్పడంతో ఈ మార్గంలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. శనివారం రాత్రి తూర్పు మధ్య రైల్వే పరిధ
పట్టాలు తప్పిన గూడ్స్ .. ఎనిమిది వ్యాగన్లు తిరగబడి..


హాజీపూర్/ఢిల్లీ28,డిసెంబర్ (హి.స.) : బీహార్‌లోని హాజీపూర్ పరిధిలో రైలు ప్రమాదం సంభవించింది. ఒక గూడ్స్ రైలుకు చెందిన ఎనిమిదికి పైగా వ్యాగన్లు పట్టాలు తప్పడంతో ఈ మార్గంలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. శనివారం రాత్రి తూర్పు మధ్య రైల్వే పరిధిలో జరిగిన ఈ ఘటనతో అటు అప్, ఇటు డౌన్ లైన్లలో రైళ్ల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.

ప్రమాదం జరిగిందిలా..

తూర్పు రైల్వేలోని అసన్సోల్ డివిజన్ పరిధిలో గల లాహబోన్- సిముల్తాలా స్టేషన్ల మధ్య శనివారం రాత్రి 11:25 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుందని ఈస్ట్ సెంట్రల్ రైల్వే సీపీఆర్వో (సీసీఆర్‌ఓ)వెల్లడించారు. గూడ్స్ రైలులోని ఎనిమిది వ్యాగన్లు ఒక్కసారిగా పట్టాలు తప్పి పక్కకు పడిపోయాయి. ప్రమాద సమాచారం అందిన వెంటనే రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు. అసన్సోల్, మధుపూర్, ఝాఝా ప్రాంతాల నుండి సహాయక బృందాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ప్రస్తుతం యుద్ధప్రతిపాదికన రైలు పట్టాల పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande