ఉన్నావ్‌ నేరస్థుడికి పరోక్ష సహకారం
ఢిల్లీ28,డిసెంబర్ (హి.స.) ఉన్నావ్‌ అత్యాచారం కేసులో దోషిగా తేలిన భాజపా మాజీ ఎమ్మెల్యే కులదీప్‌ సింగ్‌కు పరోక్ష సహకారం అందించేందుకు యత్నించిన దర్యాప్తు అధికారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధితురాలు శనివారం సీబీఐకి ఫిర్యాదు చేశారు. ఆ అధికారి దురుద్
ఉన్నావ్‌ నేరస్థుడికి పరోక్ష సహకారం


ఢిల్లీ28,డిసెంబర్ (హి.స.) ఉన్నావ్‌ అత్యాచారం కేసులో దోషిగా తేలిన భాజపా మాజీ ఎమ్మెల్యే కులదీప్‌ సింగ్‌కు పరోక్ష సహకారం అందించేందుకు యత్నించిన దర్యాప్తు అధికారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధితురాలు శనివారం సీబీఐకి ఫిర్యాదు చేశారు. ఆ అధికారి దురుద్దేశంతోనే దర్యాప్తును పక్కదారి పట్టించేయత్నం చేశారని, వాస్తవాలను మరుగుపరిచి బాధితురాలైన తనపై దురభిప్రాయం కలిగించేలా చేస్తూ నిందితుడికి రహస్యంగా తోడ్పాటునందించారని ఆరు పేజీల ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. తద్వారా కేసు నుంచి కులదీప్‌ సింగ్‌ను రక్షించాలన్నది అధికారి అసలు ఉద్దేశమన్నారు. దోషి కులదీప్‌ సింగ్‌కు దిల్లీ హైకోర్టు జీవిత ఖైదును నిలిపివేయడంతో పాటు షరతులతో బెయిల్‌ మంజూరు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో తాజా పరిణామం చోటుచేసుకుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande