
ఢిల్లీ ,03, డిసెంబర్ (హి.స.)శ్రీలంకలో కొనసాగుతున్న దిత్వా తుఫాన్ దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. వర్షాల దెబ్బతో వరుసగా కొండచరియలు విరిగి పడటం, భారీ వరదలు ఏర్పడటం వల్ల అనేక ప్రాంతాలు పూర్తిగా నాశనం అయ్యాయి. ముఖ్యంగా కాండీ జిల్లా తీవ్రంగా దెబ్బతింది. ఒకప్పుడు పర్యాటకులతో కిలకిలలాడిన ఈ ప్రాంతం ఇప్పుడు తుడిచిపెట్టుకుపోయినట్టుగా మారిపోయింది. మొత్తం పట్టణం నీట మునిగి, రోడ్లు, ఇళ్లు, పంటభూములు అన్నీ వరద ప్రవాహంలో కలిసిపోయాయి. ఈ విపత్తులో ఇప్పటివరకు 510 మందికి పైగా మరణించినట్లు అధికారిక సమాచారం. మరో 386 మందికి పైగా ఆచూకీ గల్లంతయ్యింది. శిథిలాలలో ఇంకా చాలా మంది ఉండే అవకాశముండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ శాఖ చెబుతోంది. యాబైవేలకు పైగా ఇళ్లు పూర్తిగా ధ్వంసమైనట్లు తెలుస్తోంది. అనేక వందల ఇళ్లు పాక్షికంగా ధ్వంసమై నివాసయోగ్యం లేకుండా మారాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ