డిజిటల్ గవర్నెన్స్కు 'పాస్పోర్ట్' కార్యక్రమం ఆదర్శం: విదేశాంగ మంత్రి జైశంకర్
హైదరాబాద్, 3 డిసెంబర్ (హి.స.) ఢిల్లీలో జరిగిన ''ఇండియాస్ వరల్డ్ యాన్యువల్ కాంక్లేవ్ 2025''లో విదేశాంగ మంత్రి జైశంకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత దశాబ్దంలో పాస్పోర్ట్ సేవలు, ప్రవాస భారతీయుల సంక్షేమంలో వచ్చిన విప్లవ
విదేశాంగ మంత్రి జైశంకర్


హైదరాబాద్, 3 డిసెంబర్ (హి.స.)

ఢిల్లీలో జరిగిన 'ఇండియాస్ వరల్డ్

యాన్యువల్ కాంక్లేవ్ 2025'లో విదేశాంగ మంత్రి జైశంకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత దశాబ్దంలో పాస్పోర్ట్ సేవలు, ప్రవాస భారతీయుల సంక్షేమంలో వచ్చిన విప్లవాత్మక మార్పులను వివరించారు. పది సంవత్సరాల క్రితం, పాస్పోర్ట్ కోసం దరఖాస్తు చేయడానికి దేశంలో కేవలం 77 కేంద్రాలు మాత్రమే ఉండేవని, కానీ గత పదేళ్లలో 468 కొత్త కేంద్రాలను జోడించినట్టు ఆయన తెలిపారు.

పాస్పోర్ట్ జారీ వేగం, పత్రాల స్పష్టత వంటి అంశాలను క్రమబద్ధీకరించడం జరిగిందని, ఈ రోజుల్లో పాస్పోర్ట్ గురించి ఎవరూ మాట్లాడకపోవడమే ఈ విజయాన్ని సూచిస్తుందని అన్నారు. భారతదేశంలో డిజిటల్ గవర్నెన్స్కు 'పాస్పోర్ట్ కార్యక్రమం' ఒక ఆదర్శంగా (Poster Child) నిలిచిందని ఆయన పేర్కొన్నారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande