శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో గందరగోళం
హైదరాబాద్,03, డిసెంబర్ (హి.స.) శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండిగో ఫ్లైట్‌లకు సాంకేతిక లోపాలు ఏర్పడటంతో భారీ గందరగోళం చోటుచేసుకుంది. ముంబై, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ వంటి ప్రధాన నగరాలకు బయలుదేరాల్సిన విమానాలు వరుసగ
Indigo


హైదరాబాద్,03, డిసెంబర్ (హి.స.) శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండిగో ఫ్లైట్‌లకు సాంకేతిక లోపాలు ఏర్పడటంతో భారీ గందరగోళం చోటుచేసుకుంది. ముంబై, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ వంటి ప్రధాన నగరాలకు బయలుదేరాల్సిన విమానాలు వరుసగా ఆలస్యమవడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

చాలా మందిప్రయాణికులు నిన్నటి నుంచి ఎయిర్‌పోర్ట్‌లోనే వేచి చూస్తూ ఇబ్బందులు పడుతున్నారు. ఫ్లైట్‌ల ఆలస్యం గురించి సరైన వివరణ ఇవ్వలేని పరిస్థితి ఏర్పడటంతో ఇండిగో సిబ్బంది ప్రయాణికుల ప్రశ్నలకు సమాధానం చెప్పడంలో కష్టాలు ఎదుర్కొంటున్నారు. తెల్లవారుజామున 2 గంటలకు బెంగళూరు వెళ్లాల్సిన ఒక ఇండిగో ఫ్లైట్‌ను రన్‌వేపై రెండు గంటల పాటు నిలిపివేయడంతో ప్రయాణికులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. చివరికి వారిని తిరిగి విమానం నుంచి కిందకు దింపి టెర్మినల్‌లో ఉంచగా, ప్రయాణికుల అసహనం మరింత పెరిగింది.

ఈ గందరగోళంలో అత్యంత ఇబ్బందులకు గురవుతున్న వారు కనెక్టింగ్ విమానాలు మిస్ అయిన విదేశీ ప్రయాణికులు, వీసా ఇంటర్వ్యూల కోసం వివిధ రాష్ట్రాలకు వెళ్లాల్సిన వారు. ఫ్లైట్ ఆలస్యాలపై స్పష్టమైన సమాచారం అందకపోవడంతో, కొందరు ప్రయాణికులు ఇండిగో ఉద్యోగులతో వాగ్వాదానికి దిగారు. ఇండిగో ఫ్లైట్‌ల సాంకేతిక సమస్యలు ఎప్పుడు పరిష్కరించబడతాయన్నదానిపై ఇంకా స్పష్టత లేని పరిస్థితి నెలకొంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande