హేమంత్ సోరెన్‌ ప్రభుత్వంలో ప్రకంపనలు.
ఢిల్లీ ,03, డిసెంబర్ (హి.స.) హేమంత్ సోరెన్ సర్కార్‌.. కమలంతో జతకట్టబోతుందంటూ ఉధృతంగా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో జేఎంఎం పార్టీ ఎక్స్‌లో కీలక పోస్ట్ చేసింది. ఇటీవల హేమంత్ సోరెన్-కల్పనా సోరెన్ దంపతులు ఢిల్లీలో పర్యటించారు. పర్యటనలో భాగంగా బీజేపీ
హేమంత్ సోరెన్‌ ప్రభుత్వంలో ప్రకంపనలు.


ఢిల్లీ ,03, డిసెంబర్ (హి.స.) హేమంత్ సోరెన్ సర్కార్‌.. కమలంతో జతకట్టబోతుందంటూ ఉధృతంగా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో జేఎంఎం పార్టీ ఎక్స్‌లో కీలక పోస్ట్ చేసింది.

ఇటీవల హేమంత్ సోరెన్-కల్పనా సోరెన్ దంపతులు ఢిల్లీలో పర్యటించారు. పర్యటనలో భాగంగా బీజేపీ అగ్ర నాయకులను రహస్యంగా కలిసి మంతనాలు జరిపినట్లుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో హేమంత్ సోరెన్‌ ఎన్డీఏ కూటమిలో చేరబోతున్నట్లుగా కథనాలు పేర్కొంటున్నాయి. బీజేపీతో పొత్తుకు కల్పనా సోరెన్ కీలక పాత్ర పోషించినట్లుగా తెలుస్తోంది. త్వరలోనే ఎన్డీఏ కూటమిలో చేరే అవకాశాలు ఉన్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

బీహార్ ఎన్నికల సమయంలో ఇండియా కూటమి సరిగ్గా పట్టించుకోలేదని హేమంత్ దంపతులు గుర్రుగా ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే చాలా రోజులుగా ఢిల్లీలో బీజేపీ అగ్ర నేతలతో హేమంత్ సోరెన్ దంపతులు రహస్య చర్చలు జరిపినట్లుగా సమాచారం. అయితే అధికార మార్పిడిపై జోరుగా ప్రచారం జరగడంతో జేఎంఎం సోషల్ మీడియాలో కీలక పోస్ట్ పెట్టింది. ‘జార్ఖండ్ తలవంచదు’ అంటూ వ్యాఖ్యానించింది. అయితే ఈ పోస్ట్ అర్థం వేరే అంటూ మాట్లాడుతున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande