
న్యూఢిల్లీ, 3 డిసెంబర్ (హి.స.)
మానవతా దృక్పథంతో గర్భిణీ స్త్రీ,
కుమారుడిని వెనక్కి రప్పిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చింది. కొద్ది రోజుల క్రితం.. బంగ్లాదేశీయులు అనే ఆరోపణలతో భారతదేశం నుంచి బహిష్కరించబడిన (deported) గర్భిణీ స్త్రీ సునాలి ఖాతున్, ఆమె 8 ఏళ్ల కుమారుడిని భారతదేశానికి తిరిగి రప్పించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. వారు భారత పౌరులు అయ్యే అవకాశం ఉండటం, మానవతా దృక్పథాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం కోర్టుకు హామీ ఇచ్చింది.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు