
ఝార్ఖండ్, 3 డిసెంబర్ (హి.స.) వేగంగా వెళ్తున్న కారు డివైడర్
ఢీకొట్టడంతో.. ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద సంఘటన ఝార్ఖండ్లోని హజారీబాగ్ జిల్లాలో బుధవారం ఉదయం చోటు చేసుకుంది. కారు డివైడర్ ను ఢీకొట్టి బోల్తాపడటంతో ఒక చిన్నారి సహా ముగ్గురు వ్యక్తులు మరణించారు. అలాగే కారులో ఉన్న మరో ఏడుగురు గాయపడ్డారు. బార్హి పోలీస్ స్టేషన్ పరిధిలోని గంగ్హాహి వంతెన (Gangtahi bridge) సమీపంలో ఉదయం 6.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు