
ఢిల్లీ ,03, డిసెంబర్ (హి.స.) పార్లమెంట్ శీతాకాల సమావేశాల వేళ కాంగ్రెస్ నాయకురాలు పోస్ట్ చేసిన ఓ వీడియో తీవ్ర దుమారం రేపింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీని కించపరిచేలా ఆ వీడియో (Congress AI Video on PM Modi) ఉండటంపై భాజపా నేతలు భగ్గుమన్నారు. అసలేం జరిగిందంటే..
కాంగ్రెస్ (Congress) సీనియర్ నాయకురాలు రాగిణి నాయక్ తన సోషల్‌మీడియా ఖాతాలో ఓ పోస్ట్ చేశారు. ప్రధాని (PM Modi) చాయ్ అమ్ముతున్నట్లుగా ఉన్న ఏఐ జనరేటెడ్ వీడియో అది. దీంతో ఇది వివాదాస్పదమైంది. ఈ వీడియోపై భాజపా తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ప్రధాని మూలాలను వారు అవమానిస్తున్నారంటూ భాజపా (BJP) అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా దుయ్యబట్టారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ