దేశవ్యాప్తంగా నిలిచిపోయిన ఇండిగో విమాన సేవలు
ముంబై, 3 డిసెంబర్ (హి.స.) ఇండిగో విమాన సేవలు దేశవ్యాప్తంగా నిలిచిపోయాయి. ఇండిగో విమానాలన్నీ ఎయిర్ పోర్టులకే పరిమితం అయ్యాయి. శంషాబాద్ విమానాశ్రయంలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. నిన్న‌ రాత్రి నుండి ఎయిర్ పోర్ట్‌లలో ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నా
విమాన సేవలు


ముంబై, 3 డిసెంబర్ (హి.స.)

ఇండిగో విమాన సేవలు దేశవ్యాప్తంగా నిలిచిపోయాయి. ఇండిగో విమానాలన్నీ ఎయిర్ పోర్టులకే పరిమితం అయ్యాయి. శంషాబాద్ విమానాశ్రయంలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. నిన్న‌ రాత్రి నుండి ఎయిర్ పోర్ట్‌లలో ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. టెక్నికల్ సమస్య కారణంగానే విమాన సర్వీసులు నిలిచిపోయినట్టు తెలుస్తోంది. బెంగుళూరు కంపెగౌడ విమానాశ్ర‌యంలో 42 ఇండిగో విమానాల‌ను ర‌ద్దు చేసిన‌ట్టు స‌మాచారం.

మ‌రోవైపు నిన్న కూడా పలు విమానాలకు అంతరాయం కలిగింది. కోయంబ‌త్తూరు విమానాశ్ర‌యంలో ముంబైకి వెళ్లాల్సిన ఇండిగో విమానం మూడు గంట‌లు ఆల‌స్యం అయింది. దీంతో ప్ర‌యాణికులు తీవ్ర అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. ఎయిర్ పోర్టులో కూర్చునేందుకు స్థ‌లం లేద‌ని, ఫ్లైట్ ఆల‌స్యం అవ్వ‌డంపై సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ముంబైలో భారీ వ‌ర్షం కార‌ణంగా విమానం ఆల‌స్యంగా న‌డుస్తోంద‌ని సిబ్బంది సమాధానం ఇచ్చారు. ఇక నేడు దేశవ్యాప్తంగా ఇలాంటి పరిస్థితే నెలకొంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande