ఈ.మధ్య కాలంలో రోడ్డు ప్రమాదాల.సంఖ్య.పెరిగిపోతుంది
ప్రకాశం, 31 డిసెంబర్ (హి.స.) , ఈ మధ్యకాలంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. ఇంట్లో నుంచి బయటికి వచ్చినవాళ్లు క్షేమంగా ఇంటికి చేరుతామా లేదా అన్న టెన్షన్‌లో ఉన్నారు. రోడ్డుపై వాహనాలు నడిపే సమయంలో డ్రైవర్లు చేస్తున్న నిర్లక్ష్యం వల్ల
ఈ.మధ్య కాలంలో రోడ్డు ప్రమాదాల.సంఖ్య.పెరిగిపోతుంది


ప్రకాశం, 31 డిసెంబర్ (హి.స.)

, ఈ మధ్యకాలంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. ఇంట్లో నుంచి బయటికి వచ్చినవాళ్లు క్షేమంగా ఇంటికి చేరుతామా లేదా అన్న టెన్షన్‌లో ఉన్నారు. రోడ్డుపై వాహనాలు నడిపే సమయంలో డ్రైవర్లు చేస్తున్న నిర్లక్ష్యం వల్ల ఎంతోమంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా అలాంటి ఘటనే ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళితే...

రాచర్ల మండలం రంగారెడ్డి‌పల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డీసీఎం వ్యాన్‌ను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసు కుంది. డీసీఎంలో మంటలు చెలరేగడంతో అందులోని డ్రైవర్ సజీవదహనం అయ్యాడు. మరొకరికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. మృతుడు అనంతపురం జిల్లాకు చెందిన వెర్రి స్వామిగా గుర్తించారు. గాయపడిన మరో వ్యక్తి కూడా అనంతపురం వాసి జయరామరెడ్డిగా గుర్తించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande