పిల్లలకు అన్నం పెట్టలేని చేతగాని సర్కారు ఇది: హరీష్ రావు ఫైర్
హైదరాబాద్, 31 డిసెంబర్ (హి.స.) మన ఊరు మన బడి కాంట్రాక్టర్లకు రావాల్సిన బిల్లులు విడుదల చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. బుధవారం కాంట్రాక్టర్లు హరీష్ రావును కలిశారు. ఈ సందర్భంగా వినతిపత్రం అందించారు. అ
హరీష్ రావు ఫైర్


హైదరాబాద్, 31 డిసెంబర్ (హి.స.)

మన ఊరు మన బడి కాంట్రాక్టర్లకు రావాల్సిన బిల్లులు విడుదల చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. బుధవారం కాంట్రాక్టర్లు హరీష్ రావును కలిశారు. ఈ సందర్భంగా వినతిపత్రం అందించారు. అనంతరం హరీష్ రావు మాట్లాడుతూ.. తెలంగాణ వ్యాప్తంగా మన ఊరు మన కాంట్రాక్టర్లు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయారు. కమీషన్ల కోసం బడా కాంట్రాక్టర్ల బిల్లులు రిలీజ్ చేసే రేవంత్ రెడ్డికి చిన్న కాంట్రాక్టర్ల సమస్యలు కనిపించడం లేదా? లేక కమీషన్లు రావు అని బిల్లులు ఇవ్వడం లేదా? అని అడిగారు. మన ఊరు మన బడి కార్యక్రమానికి చెందిన రూ.512కోట్ల రెడీ ఫర్ పేమెంట్ ఉన్న బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande