
జనగామ, 31 డిసెంబర్ (హి.స.)
జనగామ జిల్లాలో విషాదం చోటు
చేసుకుంది. జిల్లా పరిధిలోని బచ్చన్నపేట మండలం చిన్న రామచర్ల గ్రామంలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. అనారోగ్యంతో బాధపడుతున్న భార్య, భర్తలు పురుగుల మంది తాగి ఆత్మహత్య చేసుకున్నారు. బచ్చన్నపేట గ్రామానికి చెందిన రాంరెడ్డి, లక్ష్మి అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత అర్థరాత్రి ఇద్దరూ కలిసి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు