2025లో లంచగొండి అధికారులకు చుక్కలు చూపెట్టిన ఏసీబీ
హైదరాబాద్, 31 డిసెంబర్ (హి.స.) 2025 సంవత్సరంలో తెలంగాణ యాంటీ కరప్షన్ బ్యూరో (ACB) పంజా విసిరింది. ఈ ఏడాది మొత్తం 199 కేసులు నమోదు చేసి 273 మంది నిందితులు అరెస్ట్ చేసినట్లు ఏసీబీ డీజీ చారు సిన్హా వెల్లడించారు. ఈ మేరకు ఇవాళ ఓ ప్రకటన విడుదల చేశారు.
ఏసీబీ


హైదరాబాద్, 31 డిసెంబర్ (హి.స.)

2025 సంవత్సరంలో తెలంగాణ యాంటీ కరప్షన్ బ్యూరో (ACB) పంజా విసిరింది. ఈ ఏడాది మొత్తం 199 కేసులు నమోదు చేసి 273 మంది నిందితులు అరెస్ట్ చేసినట్లు ఏసీబీ డీజీ చారు సిన్హా వెల్లడించారు. ఈ మేరకు ఇవాళ ఓ ప్రకటన విడుదల చేశారు. 157 ట్రాప్ కేసుల్లో 224 మంది అరెస్ట్ అయ్యారని వీరిలో 176 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారని పేర్కొన్నారు. 15 అక్రమాస్తుల కేసుల్లో రూ.96.13 కోట్లు వెలికి తీశామని 54 ఆకస్మిక తనిఖీలు, సబ్లజిస్ట్రార్ కార్యాలయాలు, RTA చెక్ పోస్టులపై దాడులు నిర్వహించామని పేర్కొన్నారు. 115 మందిపై కేసులు పెట్టేందుకు ప్రభుత్వ అనుమతులు ఇచ్చిందని తెలిపారు.

ట్రాప్ కేసుల్లో ఈ ఏడాది రూ.57.17 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీటిలో బాధితులకు రూ.35.89 లక్షలు తిరిగి చెల్లించినట్లు పేర్కొన్నారు. ఏసీబీ డైరెక్టర్ జనరల్ చారు సిన్హా ఐపీఎస్ ఆధ్వర్యంలో డిసెంబర్ 3 నుంచి 9 వరకు అవినీతి నిరోధక వారోత్సవాలు నిర్వహించినట్లు తెలిపారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande