
కామారెడ్డి, 31 డిసెంబర్ (హి.స.) తెలంగాణలో రైతులకు మళ్ళీ యూరియా కష్టాలు ప్రారంభమైనవి.
సొసైటీలకు యూరియా బస్తాల లోడ్ లారీలు వచ్చాయని తెలిసి.. రైతులు వేకువ జాము నుంచే క్యూలో నిల్చొని గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వచ్చింది. కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం జంగంపల్లి, భిక్కనూరు సొసైటీల వద్ద బుధవారం యూరియా కోసం బారులు తీరారు. యూరియా కోసం గొడవలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా సొసైటీల వద్ద పోలీసులను మోహరించారు. యూరియా డిమాండ్ ను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం యాప్ ద్వారా బుకింగ్ చేసుకునే అవకాశం కల్పించినప్పటికీ ఆ ప్రక్రియ ఇంకా అమల్లోకి రాలేదని చెబుతున్నారు. ---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు