
కరీంనగర్, 31 డిసెంబర్ (హి.స.)
తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వం హామీ ఇచ్చిన 250 గజాల స్థలం వెంటనే కేటాయించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు జాతీయ రహదారిపై నిర్వహించిన వంటవార్పు కార్యక్రమంలో బుధవారం ఆమె పాల్గొని మాట్లాడారు. తెలంగాణ మనం కొట్లాడితేనే వచ్చిందని, ఉద్యమకారుల త్యాగాలకు ఇప్పటికీ తగిన గౌరవం దక్కలేదని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఉద్యమకారుల హామీలను వాడుకుందని, కానీ పెన్షన్, సంక్షేమ బోర్డు, 250 గజాల భూమి అంశాలపై ఇప్పటివరకు స్పష్టమైన ప్రకటన చేయలేదని ఆమె విమర్శించారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు