
విశాఖపట్నం 31 డిసెంబర్ (హి.స.)
విశాఖపట్నంలోమరోసారి డ్రగ్స్పట్టుబడడం స్థానికంగా కలకలం రేపింది. పోలీసుల తనిఖీల్లో ముగ్గురు నిందితులు పట్టుబడగా.. వారి వద్ద మాదక ద్రవ్యాలు లభ్యమయ్యాయి. దీంతో మరోసారి నగరంలో ఆందోళనలు మొదలయ్యాయి. పోలీసుల వివరాల ప్రకారం ఎంవీపీ సెక్టార్ లో డ్రగ్స్ వినియోగంపై పోలీసులు పక్కా సమాచారం అందుకున్నారు. ఈ మేరకు ప్రత్యేక బృందంగా ఏర్పడి నిఘాను ఉంచారు. నిందితులు డ్రగ్స్ వినియోగిస్తున్న సమయంలో వారిని పట్టుకునేందుకు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ క్రమంలో వినయ్, సాయి, శ్యామ్ అనే వ్యక్తులు పోలీసులకు పట్టుబడ్డారు. వారి నుంచి 4.5 గ్రాముల ఎండీఎంఏ, 5.5 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు వినయ్ బెంగళూరు నుంచి విశాఖకు డ్రగ్స్ తీసుకొచ్చినట్లు గుర్తించారు. ఈ మేరకు ముగ్గురిని అరెస్టు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV