ఛత్రపతి శివాజీ విగ్రహం దహనం.. రాష్ట్రవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిరసనలు
వరంగల్, 31 డిసెంబర్ (హి.స.) ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని దుండగులు తగలబెట్టిన ఘటన వరంగల్ జిల్లా రాయపర్తి మండలం బంధన్పల్లి గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. రాజకీయ కక్షల కారణంగానే కొందరు దుండగులు కావాలని విగ్రహానికి నిప్పు పెట్టారన
శివాజీ విగ్రహం


వరంగల్, 31 డిసెంబర్ (హి.స.)

ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని దుండగులు తగలబెట్టిన ఘటన వరంగల్ జిల్లా రాయపర్తి మండలం బంధన్పల్లి గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. రాజకీయ కక్షల కారణంగానే కొందరు దుండగులు కావాలని విగ్రహానికి నిప్పు పెట్టారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనతో బంధన్పల్లిలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తమ ఆత్మగౌరవానికి ప్రతీకైన మహనీయుడి విగ్రహాన్ని అవమానించడం పై హిందూత్వ సంఘాలు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని ఆందోళన చేపట్టారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande