బీజాపూర్‌ ఎన్‌కౌంటర్‌-19 మంది మావోయిస్టులు మృతి
ఢిల్లీ ,04 డిసెంబర్ (హి.స.) బీజాపూర్‌ ఎన్‌కౌంటర్‌లో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. మొత్తం 19 మంది మావోయిస్టులు మృతి చెందారని గురువారం అధికారులు ప్రకటించారు. ఈ సంఖ్య మరింత పెరగొచ్చని అంచనా వేస్తున్నారు. అంతేకాదు.. మృతుల్లో ఓ అగ్రనేత ఉన్నట్లు సమా
Maoists


ఢిల్లీ ,04 డిసెంబర్ (హి.స.) బీజాపూర్‌ ఎన్‌కౌంటర్‌లో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. మొత్తం 19 మంది మావోయిస్టులు మృతి చెందారని గురువారం అధికారులు ప్రకటించారు. ఈ సంఖ్య మరింత పెరగొచ్చని అంచనా వేస్తున్నారు. అంతేకాదు.. మృతుల్లో ఓ అగ్రనేత ఉన్నట్లు సమాచారం అందుతోంది.

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో బుధవారం మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 12 మంది మావోయిస్టులు అక్కడికక్కడే మరణించారు. ముగ్గురు భద్రతా బలగాల సిబ్బంది కూడా అమరులయ్యారు. ఘటనాస్థలి నుంచి మావోయిస్టుల మృతదేహాలతోపాటు.. భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.

అయితే ఆ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటిదాకా 19 మంది మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాల లభ్యం.. కూంబింగ్‌ కొనసాగుతుండడంతో.. మృతుల సంఖ్య 25 దాకా ఉండొచ్చని భావిస్తున్నారు. అలాగే.. మృతుల్లో పీఎల్‌జీఏ-2 కమాండర్‌ వెల్ల మోడియం కూడా ఉన్నారని భావిస్తున్నారు

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande