
కర్నూలు, 4 డిసెంబర్ (హి.స.)
డ్రాగన్ ఫ్రూట్.. ఇది విభిన్నమైన పండు. ఆరోగ్య ప్రయోజనాలు మాత్రం పుష్కలంగా ఉన్నాయి. శరీరానికి అవసరమైన పోషకాలు, ఖనిజాలు సమృద్ధిగా నిండి ఉంటాయి. రోజుకో పండు తినటం వల్ల రోజంతా శక్తివంతంగా, ఉత్సాహంగా ఉంటారు. యాక్టివ్‌గా పనిచేస్తారు. డ్రాగన్ ఫ్రూట్ లో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. నీరు- డైటరీ ఫైబర్ అధికంగా వున్న డ్రాగన్ ఫ్రూట్ మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఐరన్ పుష్కలంగా ఉండి రక్తహీనతను తగ్గిస్తుంది. విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
డ్రాగన్ ఫ్రూట్ తినడం ఆరోగ్యానికి మంచిది. ఇందులో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు ఉండటం వల్ల గుండె ఆరోగ్యానికి మంచిది. డ్రాగన్ ఫ్రూట్ రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. డ్రాగన్ ఫ్రూట్‌లోని భాస్వరం, మెగ్నీషియం దృఢమైన ఎముకలు, దంతాల నిర్మాణానికి సహాయపడుతుంది. డ్రాగన్ ఫ్రూట్‌లో ఫైబర్ ఎక్కువగా వుంటుంది. కనుక ఇది బరువు తగ్గడానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఉచిత ఆర్గానిక్ ఫైబర్ లభిస్తుంది. ఇది బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఇకపోతే, డ్రాగన్ ఫ్రూట్ డయాబెటిస్ రోగులకు కూడా మంచిదని నిపుణులు చెబుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV