తిరువణ్ణామలైలో దర్శనమిచ్చిన మహా దీపం.. గురువారం కూడా కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరువణ్ణామలై, 4 డిసెంబర్ (హి.స.)గత సంవత్సర కాలంగా తమిళనాడులోని తిరువణ్ణామలైకి భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా కర్నాటక మరియు తెలుగు రాష్ట్రాల నుంచి శివ భక్తులు అరుణచలం (Arunachalam)కు వెళ్తుండటంతో అక్కడ నిత్యం భక్తుల రద్ధీ కనిపిస్తుంది.
ా


తిరువణ్ణామలై, 4 డిసెంబర్ (హి.స.)గత సంవత్సర కాలంగా తమిళనాడులోని తిరువణ్ణామలైకి భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా కర్నాటక మరియు తెలుగు రాష్ట్రాల నుంచి శివ భక్తులు అరుణచలం (Arunachalam)కు వెళ్తుండటంతో అక్కడ నిత్యం భక్తుల రద్ధీ కనిపిస్తుంది. ముఖ్యంగా పౌర్ణమి సమయాల్లో ఈ రద్దీ విపరీతంగా మారుతున్న విషయం తెలిసిందే. గత కార్తీక మాసంలోను తిరువణ్ణామలైలో నిత్యం భక్తుల రద్దీ కొనసాగింది. ఇదిలా ఉంటే బుధవారం కార్తీక దీపం పండుగలో అత్యంత ముఖ్యమైన ఘట్టమైన మహా దీపం అన్నామలై కొండపై వెలిగింది. ఈ మహా దీపాన్ని దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు అక్కడికి చేరుకున్నారు. నిన్న సాయంత్రం మహా దీపం దర్శనమివ్వగా.. నేటికి తిరువణ్ణామలై దివ్య శక్తితో మారుమోగుతూనే ఉంది. భక్తులు గత రాత్రి నుంచి ఈరోజు వరకు మహా దీపాలను దర్శించుకుంటున్నారు.

ఈరోజు గురువారం ఉదయం తిరువణ్ణామలైలో వాతావరణం ప్రశాంతంగా, ఆధ్యాత్మికంగా ఉంది. అరుణాచలేశ్వర ఆలయం, అన్నామలై కొండల నుండి వచ్చిన దృశ్యాలలో భక్తుల రద్దీ తగ్గినట్లు కనిపించింది. కొంతమంది భక్తులు మాత్రమే గిరి ప్రదక్షిణలు చేస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande