
న్యూఢిల్లీ, 4 డిసెంబర్ (హి.స.) రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) నేటి నుంచి భారతదేశంలో పర్యటించనున్నారు. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ప్రత్యేక విమానంలో న్యూఢిల్లీకి చేరుకుంటారు.
అక్కడ ప్రధాని మోడీ (Prime Minister Modi) సహా ఇతర అధికారులు ఆయనకు స్వాగతం పలుకుతారు. అనంతరం రాత్రి 7 గంటలకు లోక్ కళ్యాణ్ మార్గ్ రెసిడెన్స్ వద్ద ప్రధాని నరేంద్ర మోదీ పుతిన్‌కు డిన్నర్ పార్టీ ఇవ్వనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే ఈ పర్యటనలో భాగంగా శుక్రవారం ఉదయం 9 గంటలకు రాష్ట్రపతి భవన్ వద్ద పుతిన్‌కు త్రివిధ దళాల గౌరవ వందనం అందిస్తారు. ఆ తర్వాత ఆయన రాజ్ ఘాట్‌లో ప్రధాని మోడీతో కలిసి మహాత్మా గాంధీకి నివాళులర్పిస్తారు.
ఈ పర్యటనలో ప్రధాన ఘట్టం రేపు ఉదయం 11 గంటలకు హైదరాబాద్ హౌస్ (Hyderabad House)లో జరగబోయే 23వ భారత్-రష్యా శిఖరాగ్ర సమావేశం నిలవనుంది. ఈ సమావేశంలో ప్రధాని మోదీ, అధ్యక్షుడు పుతిన్ పాల్గొని ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై (Bilateral relations) చర్చించనున్నారు. ముఖ్యంగా, అమెరికా విధించిన ఆర్థిక ఆంక్షల నేపథ్యంలో ఈ పర్యటన మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ ఆంక్షల ప్రభావం లేకుండా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని, రక్షణ, ఆర్థిక సహకారాన్ని కొనసాగించడం ఈ చర్చల్లో ప్రధాన అంశాలుగా ఉండే అవకాశం ఉంది. పుతిన్ పర్యటన నేపథ్యంలో ఢిల్లీలో పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV