విమానాల రద్దు, ఆలస్యం.. ఇండిగో ఎయిర్ లైన్స్ కు సమన్లు జారీ చేసిన DGCA
ఢిల్లీ,, 4 డిసెంబర్ (హి.స.) దేశ‌వ్యాప్తంగా ఇండిగో విమాన సేవ‌ల్లో అంత‌రాయం నెల‌కొన్న సంగ‌తి తెలిసిందే. ఢిల్లీ,ముంబై, హైద‌రాబాద్‌లో పెద్ద ఎత్తున విమాన సర్వీసులు రద్దయ్యాయి. నిన్న దాదాపు 200 విమానాలు రద్దయయ్యాయి. ఈ నేపథ్యంలో పౌర విమానయాన డైరెక్టరేట్
విమాన సేవలు


ఢిల్లీ,, 4 డిసెంబర్ (హి.స.) దేశ‌వ్యాప్తంగా ఇండిగో విమాన సేవ‌ల్లో అంత‌రాయం నెల‌కొన్న సంగ‌తి తెలిసిందే. ఢిల్లీ,ముంబై, హైద‌రాబాద్‌లో పెద్ద ఎత్తున విమాన సర్వీసులు రద్దయ్యాయి.

నిన్న దాదాపు 200 విమానాలు రద్దయయ్యాయి. ఈ నేపథ్యంలో పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ (DGCA) ఇండిగో అధికారులకు సమన్లు జారీ చేసింది. దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థగా పేరున్న ఇండిగో కార్యాచరణ సమస్యలపై దర్యాప్తు చేసేందుకు సమన్లు ఇచ్చింది.

ఇక బుధవారం 200 విమానాలు రద్దు కాగా నేడు గురువారం 170కి పైగా విమానాలు రద్దు అయ్యే అవకాశం ఉంది. కొత్త FDTL నిబంధనలతో పైలట్ల కొరత తీవ్రతరం అయినట్టు తెలుస్తోంది. కొత్త FDTL నిబంధనల ప్రకారం పైలట్లకు వారానికి 48 గంటల విశ్రాంతి తప్పనిసరి. దీంతో పైలట్లు అందుబాటులో లేకపోవడం వల్ల కూడా విమానాల సేవల్లో అంతరాయం నెలకొంటున్నట్టు తెలుస్తోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande