తీవ్రవాద కుట్ర కేసు.. 22 ప్రాంతాల్లో ఎన్ఐఏ విస్తృత దాడులు
ఢిల్లీ, 4 డిసెంబర్ (హి.స.)ఒక తీవ్రవాద కుట్ర కేసు విచారణలో భాగంగా జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) దేశవ్యాప్తంగా 22 ప్రాంతాల్లో విస్తృత దాడులు నిర్వహిస్తోంది. ఈ సోదాలు ప్రధానంగా ఉత్తర ప్రదేశ్, బీహార్, హర్యానా రాష్ట్రాల్లో ఉదయం నుంచి జరుగుతున్నాయి. ఈ కేసు
NIA


ఢిల్లీ, 4 డిసెంబర్ (హి.స.)ఒక తీవ్రవాద కుట్ర కేసు విచారణలో భాగంగా జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) దేశవ్యాప్తంగా 22 ప్రాంతాల్లో విస్తృత దాడులు నిర్వహిస్తోంది. ఈ సోదాలు ప్రధానంగా ఉత్తర ప్రదేశ్, బీహార్, హర్యానా రాష్ట్రాల్లో ఉదయం నుంచి జరుగుతున్నాయి. ఈ కేసు ఉత్తర ప్రదేశ్ నుండి బీహార్ లోని వివిధ ప్రాంతాలకు జరుగుతున్న అక్రమ మందుగుండు సామాగ్రి (illegal ammunition) రవాణాకు సంబంధించినదిగా గుర్తించారు. ఈ ఆయుధాల అక్రమ రవాణాలో ఉన్న నెట్‌వర్క్, తీవ్రవాద కుట్రలకు గల లింక్‌లను ఛేదించేందుకు NIA ఈ దాడులు చేపట్టింది. ఈ దాడుల ద్వారా మరిన్ని ఆధారాలు, నిందితులను గుర్తించే అవకాశం ఉంది.

ఇదిలా ఉంటే ఢిల్లీలో ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడి తర్వాత దేశవ్యాప్తంగా ఎన్ఐఏ (NIA) ఉగ్రకుట్రలపై ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పదుల సంఖ్యలు ఉగ్రవాదులను వారి సానుభూతిపరులను అరెస్ట్ చేయడంతో పాటు ఉగ్ర నెట్ వర్క్ కు సంబంధించిన పూర్తి వివరాలను వెలికి తీస్తు.. ఉగ్ర మూలాలపై దెబ్బ కొడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రోజు 22 ప్రాంతాల్లో జరుగుతున్న దాడులు ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande