
శబరిమల, 5 డిసెంబర్ (హి.స.)
కేరళలోని ప్రసిద్ధ శబరిమల అయ్యప్ప క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు అయ్యప్ప దర్శనం కోసం భారీగా తరలి వస్తున్నారు. ఆలయ ప్రాంగణమంతా అయ్యప్ప నామస్మరణతో మార్మోగుతుంది. ఇదిలా ఉంటే.. శబరిమలలో ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. స్థానిక వ్యాపారి తెలుగు రాష్ట్రానికి చెందిన ఓ భక్తుడి తల పగలగొట్టిన ఘటన తీవ్ర కలకలం రేపింది. అయితే.. వాటర్ బాటిల్ ధర ఎక్కువగా ఉందని భక్తుడు ప్రశ్నించడంతో వ్యాపారి కోపంతో ఊగిపోయాడు.
ఈ క్రమంలోనే భక్తుడి తలపై గాజు సీసాతో దాడి చేశాడు. అంతటితో ఆగకుండా హైదరాబాద్ నగరానికి చెందిన ఒక భక్తుడి మాలను తెంపేశాడు. దీంతో తెలుగు రాష్ట్రాలకు చెందిన భక్తులు షాపు వద్దకు చేరుకుని నిరసనకు దిగారు. ఈ తరుణంలో స్థానిక వ్యాపారులు సైతం ఎదురు దాడికి దిగడంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. దీంతో పోలీసులు భక్తులను, స్థానిక వ్యాపారులను అడ్డుకున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV