ఇండిగో విమాన సర్వీసులపై రాహుల్‌
ఢిల్లీ 5 డిసెంబర్ (హి.స.)దేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో సర్వీసుల్లో అంతరాయం కొనసాగుతుంది. దీనిపై తాజాగా కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) స్పందించారు. ప్రభుత్వ గుత్తాధిపత్యమే దీనికి ప్రధాన కారణమంటూ ఆయన ఆరోపణలు చేశారు (IndiGo
Indigo Airlines


ఢిల్లీ 5 డిసెంబర్ (హి.స.)దేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో సర్వీసుల్లో అంతరాయం కొనసాగుతుంది. దీనిపై తాజాగా కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) స్పందించారు. ప్రభుత్వ గుత్తాధిపత్యమే దీనికి ప్రధాన కారణమంటూ ఆయన ఆరోపణలు చేశారు (IndiGo Crisis).

ఈ మేరకు శుక్రవారం ఆయన ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. ప్రభుత్వ గుత్తాధిపత్యమే ఇండిగో విమానాల రద్దు, ఆలస్యాలకు ప్రధాన కారణాలన్నారు. ఎప్పటిలాగానే ఈ నిస్సహాయతకు సాధారణ పౌరులే మూల్యం చెల్లిస్తున్నారన్నారు. ఈ సందర్భంగా ఇలాంటివి మరోసారి జరగకుండా ఉండేందుకు విమానయాన రంగంతో సహా అన్నింట్లోనూ న్యాయమైన పోటీ ఉండాలని పిలుపునిచ్చారు. మ్యాచ్‌ఫిక్సింగ్‌, గుత్తాధిపత్యాలు కాదంటూ మండిపడ్డారు. ఈ అంశంపై పార్లమెంటులో చర్చ జరపాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. శివసేన యూబీటీ ఎంపీ ప్రియాంక చతుర్వేది (Priyanka Chaturvedi) రాజ్యసభలో పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడుకు నోటీసులు ఇచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande