తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత.. ఆదిలాబాద్లో అత్యల్పము 9.2 డిగ్రీలు
ఆదిలాబాద్, 7 డిసెంబర్ (హి.స.) దిత్వా తుఫాను కారణంగా తెలంగాణలో తగ్గిన చలి మరోసారి పంజా విసురుతోంది. ఈ రోజు ఉదయం తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత హఠాత్తుగా పెరిగింది. పలు ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ముఖ్యంగా ఆదిలాబాద్లో 9.2
చలి


ఆదిలాబాద్, 7 డిసెంబర్ (హి.స.)

దిత్వా తుఫాను కారణంగా

తెలంగాణలో తగ్గిన చలి మరోసారి పంజా విసురుతోంది. ఈ రోజు ఉదయం తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత హఠాత్తుగా పెరిగింది. పలు ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ముఖ్యంగా ఆదిలాబాద్లో 9.2 డిగ్రీలు, మెదక్లో11.3 డిగ్రీలు అత్యల్ప ఉష్ణోగ్రతలుగా రికార్డయ్యాయి. అలాగే, హనుమకొండలో 13.5 డిగ్రీలు, రామగుండంలో 14.2 డిగ్రీలు, రాజధాని హైదరాబాద్లో 15.6 డిగ్రీలు, నల్గొండలో 16 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉన్నందున, రాష్ట్ర ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande