పిల్లలకు ఆరోగ్య అలవాట్లు ముఖ్యం.. వెంకయ్య నాయుడు
హైదరాబాద్, 7 డిసెంబర్ (హి.స.) హైదరాబాద్లోని రాయదుర్గంలో ''ది ఫుట్ డాక్టర్ హాస్పిటల్'' వారు ఆదివారం.. ''వాకథాన్'' కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల్లో మధుమే
వెంకయ్య నాయుడు


హైదరాబాద్, 7 డిసెంబర్ (హి.స.)

హైదరాబాద్లోని రాయదుర్గంలో 'ది

ఫుట్ డాక్టర్ హాస్పిటల్' వారు ఆదివారం.. 'వాకథాన్' కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల్లో మధుమేహం విస్తరిస్తున్న నేపథ్యంలో హాస్పిటల్ నిర్వహించిన ఈ కార్యక్రమం చాలా మంచిదన్నారు. ఈ సందర్భంగా ఆయన పిల్లలు ఆరోగ్యంగా జీవించడానికి చిన్ననాటి నుంచే అలవాట్లను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. ఉదయాన్నే నిద్ర లేవడం, వ్యాయామం, యోగా సాధన, క్రీడల్లో పాల్గొనడం వంటి ఆరోగ్యకరమైన అలవాట్లు నేర్చుకోవడం చాలా ముఖ్యమని వెంకయ్యనాయుడు నొక్కి చెప్పారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande