ఆరవ రోజు కూడా కొనసాగుతున్న ఇండిగో సంక్షోభం.. నేడు 650 విమానాలు రద్దు.!
హైదరాబాద్, 7 డిసెంబర్ (హి.స.) ఇండిగో ఎయిర్లైన్స్ సంక్షోభం కొనసాగుతుంది. ఆరో రోజు ఆదివారం దేశవ్యాప్తంగా ప్రధాన విమానాశ్రయాల్లో 650 విమానాలు రద్దయ్యాయి. ఇండిగోలో కొనసాగుతున్న సంక్షోభం కారణంగా గత ఆరు రోజుల్లో దాదాపు 3వేలకుపైగా విమానాలు రద్దయ్యాయి. దా
ఇండిగో


హైదరాబాద్, 7 డిసెంబర్ (హి.స.)

ఇండిగో ఎయిర్లైన్స్ సంక్షోభం కొనసాగుతుంది. ఆరో రోజు ఆదివారం దేశవ్యాప్తంగా ప్రధాన విమానాశ్రయాల్లో 650 విమానాలు రద్దయ్యాయి. ఇండిగోలో కొనసాగుతున్న సంక్షోభం కారణంగా గత ఆరు రోజుల్లో దాదాపు 3వేలకుపైగా విమానాలు రద్దయ్యాయి. దాంతో దేశంలో విమాన రాకపోకలను తీవ్రంగా ప్రభావితం చేశాయి. లక్షలాది మంది ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలిగిస్తున్నది. మరో వైపు ఇండిగోపై కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. సంక్షోభంపై 24గంటల్లో స్పందించాలని పేర్కొంటూ డీజీసీఏ శనివారం ఇండిగో సీఈవో పీటర్ ఎల్బర్స్, సీవోవో, అకౌంటబుల్ మేనేజర్ పోర్కెరాస్లకు షో కాజ్ నోటీసులు జారీ చేసింది.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande