
మంచిర్యాల, 7 డిసెంబర్ (హి.స.)
స్థానిక ఎన్నికల పోరుపై పోలీసుల
నజర్ మొదలైంది. జిల్లాలో పంచాయతీ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ నిఘాను పటిష్టం చేసింది. ప్రత్యేక పోలీస్ బలగాలతో అడుగడుగునా విస్తృత తనిఖీలను చేపట్టారు. రామగుండం కమిషనరేట్ పరిధిలో నగదు, మద్యం, బహుమతులు రవాణాపై పోలీసు బృందాలు వాహనాల రాకపోకలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ సజావుగా నిర్వహించేందుకు జిల్లా సరిహద్దు ప్రాంతాల చెక్ పోస్టులు, మారుమూల ప్రాంతాలు, ప్రధాన రహదారులు, కూడళ్ల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తూ పోలీసు శాఖ చర్యలు చేపట్టింది.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు