500 కోట్లు ఇచ్చేవాడు ముఖ్యమంత్రి అవుతాడు: నవజ్యోత్ సింగ్ సిద్ధూ భార్య
చండీగఢ్, 7 డిసెంబర్ (హి.స.) పంజాబ్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ భార్య, ఆ పార్టీ నాయకురాలు నవజ్యోత్ కౌర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రూ.500 కోట్లు ఇచ్చేవాడు ముఖ్యమంత్రి అవుతాడని తెలిపారు. తమ వద్ద డబ్బు లేదని, అయితే అవకాశం ఇస్తే పంజాబ
పంజాబ్ న్యూస్


చండీగఢ్, 7 డిసెంబర్ (హి.స.) పంజాబ్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ భార్య, ఆ పార్టీ నాయకురాలు నవజ్యోత్ కౌర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రూ.500 కోట్లు ఇచ్చేవాడు ముఖ్యమంత్రి అవుతాడని తెలిపారు. తమ వద్ద డబ్బు లేదని, అయితే అవకాశం ఇస్తే పంజాబ్ను 'స్వర్ణ రాష్ట్రంగా' మార్చగలమని అన్నారు. శనివారం పంజాబ్ గవర్నర్ గులాబ్ చంద్ కటారియాను నవజ్యోత్ కౌర్ కలిశారు. రాష్ట్రంలో క్షీణిస్తున్న శాంతిభద్రతలు, ఇతర సమస్యలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు.

ఈ సందర్భంగా మీడియాతో నవజ్యోత్ కౌర్ మాట్లాడారు. పంజాబ్లో సీఎం అభ్యర్థిగా నవజ్యోత్ సింగ్ సిద్ధూను కాంగ్రెస్ పార్టీ ప్రకటిస్తే ఆయన తిరిగి క్రియాశీల రాజకీయాల్లోకి వస్తారని తెలిపారు. 'మేం ఎల్లప్పుడూ పంజాబ్, పంజాబీల కోసం మాట్లాడతాం. కానీ సీఎం కుర్చీలో కూర్చోవడానికి మా వద్ద రూ.500 కోట్లు లేవు' అని అన్నారు. ఎవరైనా డబ్బు డిమాండ్ చేశారా? అని అడిగినప్పుడు, ఎవరూ డిమాండ్ చేయలేదని చెప్పారు. అయితే 'రూ.500 కోట్ల సూట్కేస్ ఇచ్చిన వాడు ముఖ్యమంత్రి అవుతాడు' అని మరోసారి అన్నారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande