రైతు ప్రభుత్వం అంటూ రైతులను మోసం చేస్తున్నారు.. హరీష్ రావు
సిద్దిపేట, 7 డిసెంబర్ (హి.స.) సిద్దిపేట జిల్లా మక్కల మండల కేంద్రంలో మాజీ మంత్రి హరీష్ రావు ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా రేవంత్ సర్కార్పై విమర్శలు గుప్పించారు. రైతులు రెక్కలు ముక్కలు చేసుకుని పంటలు పండిస్తే డబ్బులు చెల్లించవా అని ప్రశ్నించారు.
హరీష్ రావు


సిద్దిపేట, 7 డిసెంబర్ (హి.స.)

సిద్దిపేట జిల్లా మక్కల మండల కేంద్రంలో మాజీ మంత్రి హరీష్ రావు ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా రేవంత్ సర్కార్పై విమర్శలు గుప్పించారు. రైతులు రెక్కలు ముక్కలు చేసుకుని పంటలు పండిస్తే డబ్బులు చెల్లించవా అని ప్రశ్నించారు. మక్కలు కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రెక్కలు మక్కలు పండిస్తే నేటికీ డబ్బులు చెల్లించ లేదన్నారు. చిన్నకోడూరులో 450 మంది రైతులు 59 రోజుల నుండి 45 కోట్లు చెల్లించలేదు అన్నారు. రేవంత్ రెడ్డి మాది రైతు ప్రభుత్వం అంటున్నారు. కానీ రైతులను మోసం చేస్తున్నారన్నారు. ఉత్తం కుమార్ రెడ్డి కొనుగోలు చేసిన రెండు రోజుల్లో డబ్బులు చెల్లిస్తామని చెప్పి 50 రోజులు అయిన డబ్బులు చెల్లించలేదన్నారు. యాసంగి పంట పెట్టుబడి కోసం రైతులు మద్దతు ధరకు కాకుండా తక్కువ ధరకు ప్రైవేట్ మార్కెట్లో అమ్ముతున్నారు. వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా మొక్కజొన్న రైతులకు బకాయి పడ్డ 450 కోట్ల డబ్బులు విడుదల చేయాలిని డిమాండ్ చేశారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande